Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

మీకు.. కాళ్లు పొడుగా....?

సాధారణంగా అనేకమందిలో ఉదరభాగం తక్కువగాను, కాళ్లు పొడవుగాను ఉండటాన్ని గమనిస్తుంటాం. ముఖ్యంగా మహిళలకు కాళ్లు పొడవుగా ఉంటే.. ఆ అమ్మాయికి లాంగ్స్ లెగ్స్, ఆమె జోలికెళ్లకు అని ఉచిత సలహాలు కూడా ఇస్తుంటాం. అయితే ఈ పొడుగు కాళ్ళ ఉదంతంపై ఎన్నో రకాల శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా పొడుగు కాళ్లు ఉన్నవారి ఆయుష్షు బాగా పెరుగుతుందట.

అంతేకాదండీ.. ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. మొండెం కన్నా కాళ్లు పొడుగుగా ఉంటే హృద్రోగం, పక్షవాతం, మధుమేహం వంటి వ్యాధులు తక్కువగా వస్తాయట. అంతేకాకుండా మతిస్థిమితం లేకపోవడం వంటి రుగ్మతలకు లోనుకావడం తక్కువగా ఉంటాయని ఆ పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలాగే పొడుగు కాళ్లు ఉన్న వ్యక్తులకు కెరోటిక్ ధమని గోడలు వుంటాయని అంటున్నారు.

ప్రధానంగా మహిళలకు పొడుగు కాళ్లు ఉంటే వారికి ముప్పు తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. కాలి పొడవులో ప్రతి అదనపు అంగుళానికి 16 శాతం మేర ముప్పు తగ్గుతుందని ఈ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా బాల్టిమోర్‌లోని జాన్స్ హోప్స్‌కిన్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను న్యూరాలజీ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.
నిరాకరణ