Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Family Filter | On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

తెలివొకరబ్బ సొత్తా?

తన భార్యను పోషించుకునే సంపాదన ఉన్న చిరుద్యోగి. దీంతో రాజు-రాణి ప్రేమ కొనసాగుతోంది. అసలు ఈ సోదంతా ఏమిటిని అనుకుంటున్నారు. అసలు విషయానికి వస్తాను ఉండండి.

ప్రియురాలి ఇంటికి వచ్చాడు రాజు. ప్రేమికులిద్దరూ మాటల్లోకి జారుకునేలోపు ఎవరో వచ్చి కాలింగ్ బెల్ నొక్కిన శబ్దం. రాణికి దిక్కుతోచ లేదు. ఎదురుగా భర్త. వెంటనే తేరుకొని.. ఏమండీ.. మీకు టీ పెట్టిద్దామనుకుంటే పాలు లేవండీ అంటూ గారాబంగా చెప్పింది. అంతే.. రాము ఇంటి మెట్లు కూడా ఎక్కుండా అటు నుంచే అటే పాల ప్యాకెట్‍‌ తెచ్చేందుకు దుకాణానికి వెళ్లాడు. అంతే రాజు చిన్నగా బయటకు వచ్చేశాడు.

నా ప్రియురాలికి ఎంత తెలివి. అదే నా భార్య అయితేనా..? ఇంత సమయస్ఫూర్తి ఉందా అంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకొని కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీసిన లత.. రామును చూసి బావ.. బావ.. తలనొప్పిగా ఉంది. టీ పెట్టుకుని ఇద్దరం కలసి తాగుదాం. పాలప్యాకెట్ తీసుకరావా? ప్లీజ్ అంటూ గోముగా అంది. ఇంకేముంది. భార్య మాటలు విన్న రాము ఖంగుతినక తప్పలేదు. అందుకేనండీ.. తెలివొకరి సొత్తు కాదని అంటారు మన పెద్దలు.
నిరాకరణ